News April 3, 2025
పాన్‌గల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. రేమద్దులకి చెందిన పర్వతాలు(47)కి ఐదెకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున ఓ కాల్వ ఉండగా.. అందులో నుంచి మోటార్ ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కరెంట్ లేదనుకుని మోటార్లో పట్టిన నాచును తొలగిస్తుండగా.. విద్యుత్ సరఫరా అయ్యి మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
చిత్తూరు: ఏనుగులను తరిమెందుకు ఏఐ నిఘా!

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏఐ కెమెరా, లౌడ్ స్పీకర్‌తో అనుసంధానం చేసి అమర్చి ఏనుగులు వచ్చినప్పుడు గుర్తించి లౌడ్ స్పీకర్ ద్వారా తుపాకుల శబ్దం చేసేలాగా అమర్చారు. చిత్తూరు సమీపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా సత్ఫాలితలు వచ్చాయి. దీంతో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, బంగారుపాలెంలో అమర్చేందుకు చర్యలు చేపట్టారు.
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.
News November 23, 2025
నేడు శ్రీకాకుళం రానున్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.


