News April 3, 2025
పాన్‌గల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. రేమద్దులకి చెందిన పర్వతాలు(47)కి ఐదెకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున ఓ కాల్వ ఉండగా.. అందులో నుంచి మోటార్ ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కరెంట్ లేదనుకుని మోటార్‌లో పట్టిన నాచును తొలగిస్తుండగా.. విద్యుత్ సరఫరా అయ్యి మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 20, 2025
సంగారెడ్డి: మెడికల్ కళాశాలలో 99.24 ఉత్తీర్ణత

ఎంబీబిఎస్ సెకండ్ ఇయర్ ఫలితాలను కేఎన్ఆర్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 99.24 ఉత్తీర్ణత నమోదైందని కళాశాల ప్రిన్సిపల్ డా. సుధామాధురి తెలిపారు. ఇందులో 80 మంది వైద్య విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా ఐదుగురు విద్యార్థులు డిస్టెన్షన్‌లో రాణించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ అభినందించారు.
News April 20, 2025
సౌత్‌లో హీరోయిన్లను జూమ్ చేసి మరీ..: మాళవిక

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. నడుము ఒంపులు ఎక్కువగా ఉన్న హీరోయిన్లను వారు ఇష్టపడతారని చెప్పారు. ‘నేను ముంబైలో పెరిగా కాబట్టి నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
News April 20, 2025
ములుగు: రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏటూరునాగారం 415, గోవిందరావుపేట 541, కన్నాయిగూడెం 247, మల్లంపల్లి 126, మంగపేట 563, ములుగు 863, తాడ్వాయి 504, వెంకటాపూర్ 249, వెంకటాపురం 520, వాజేడులో 670 మంది వివిధ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.