News April 21, 2025

పాన్‌గల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

పాన్‌గల్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గోప్లాపూర్‌కి చెందిన గందం చిన్న రాములు ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు ఉన్నారు. కాగా భార్యాభర్తలు ఇద్దరు దివ్యాంగులు కావడంతో పాటు నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Similar News

News April 21, 2025

16,347 పోస్టులు.. మరో UPDATE

image

APలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త సిలబస్ ప్రకారమే విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3 నుంచి పదో తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉండదు. DSCకి 80%, టెట్‌కి 20% వెయిటేజీ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉంటాయనే పూర్తి వివరాలను <>https://apdsc.apcfss.in/<<>> వెబ్‌సైట్‌లో విద్యాశాఖ ఉంచింది.

News April 21, 2025

రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

image

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్‌పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

error: Content is protected !!