News April 5, 2025
పాన్గల్: చెరువులో మృతదేహం లభ్యం

ఓ 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మండల కేంద్రంలోని పొల్కి చెరువులో లభ్యమైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ఈ వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోయిన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించాయి. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఘటనను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 6, 2025
HYD: 108వ భారత ఆర్థిక సంఘం బ్రోచర్ విడుదల

108వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సు బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని EC గదిలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విడుదల చేశారు. ఈ సదస్సు డిసెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు భారత ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్వాహకులు, పరిశోధకులను ఒకే వేదికపై తీసుకురానుంది.
News November 6, 2025
HYD:”ఓయూలో ఓరియంటేషన్ ప్రోగ్రాం”

ఓయూ టెక్నాలజీ కళాశాలలో బీ ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ హాజరై మాట్లాడారు. 108 ఏళ్ల చారిత్రక ప్రయాణంలో ఓయూ విద్యారంగంలో సమాజ నిర్మాణంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. విద్యార్థులకు విశ్వస్థాయి విద్యను అందించాలన్నదే లక్ష్యమన్నారు. బీఫార్మసీకి చాలా మంచి డిమాండ్ ఉందన్నారు.
News November 6, 2025
HYD: 50 మందికి జాయినింగ్ పత్రాలు అందజేత

ప్రతి ఆర్టీసీ సిబ్బంది భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీసీ మల్టీ సర్వీస్ ఆథరైజేషన్ ఇన్ఛార్జి ఎండీ వడ్లూరి రాజశేఖర్ అన్నారు. నాచారంలో కొత్తగా ఎంపికైన ఆర్టీసీ కండక్టర్లకు 50 మందికి జాయినింగ్ పత్రాలు అందజేశారు. అనంతరం ఎండీ రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కండక్టర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. నూతన కండక్టర్లు పాల్గొన్నారు.


