News November 28, 2024
పాపన్నపేట: పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన శాలను, మూత్రశాలలను పరిశీలించి ఉన్నత పాఠశాల HM దత్తు రెడ్డికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.