News November 28, 2024
పాపన్నపేట: పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన శాలను, మూత్రశాలలను పరిశీలించి ఉన్నత పాఠశాల HM దత్తు రెడ్డికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News December 12, 2024
సంగారెడ్డి: ఉద్యోగుల వివరాలను సేకరించాలి: DEO
సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
News December 12, 2024
చిదంబరం తెలంగాణ ప్రకటనకు కేసీఆరే కారణం: హరీశ్‌రావు
నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హరీశ్‌రావు తెలిపారు.
News December 12, 2024
రాజీమార్గమే రాజామార్గం: ఎస్పీ ఉదయ్
రాజీమార్గమే రాజామార్గం అని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడే కేసుల్లో రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏమీ సాధించలేమని అన్నారు. అదేరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.