News April 7, 2025
పాపిరెడ్డిపల్లెకు వైఎస్ జగన్.. హెలిప్యాడ్ మార్పు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ జగన్ అక్కడ ల్యాండ్ అయ్యేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాపిరెడ్డిపల్లెలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
Similar News
News November 27, 2025
గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.
News November 27, 2025
అనంత: స్కూల్ బస్సుల ఫిట్నెస్పై తనిఖీ చేయనున్న అఫీసర్

ఈనెల 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో అన్ని స్కూలు బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందని ఉప రవాణా కమిషనర్ ఎం. వీర్రాజు తెలిపారు. అనంతపురం జిల్లా రవాణా శాఖ అధికారులు కూడా స్కూల్ బస్సులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్లు వాటి పనితీరు పట్ల సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపించామన్నారు.
News November 27, 2025
అనంత: పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.


