News April 6, 2025
పాపిరెడ్డి గ్రామానికి రానున్న వైఎస్ జగన్.. రూట్మ్యాప్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8న రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్లో సీకే పల్లి చేరుకుంటారు. 10:50కి సీకే పల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు పాపిరెడ్డి గ్రామానికి చేరుకుంటారు. 11.10 వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30కి బెంగళూరుకి తిరుగు పయనమవుతారు.
Similar News
News April 12, 2025
దక్షిణాఫ్రికా ఆటగాడిపై PSLలో నిషేధం

సౌతాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బోష్పై పాకిస్థాన్ సూపర్ లీగ్ నిషేధం విధించింది. ఈ ఏడాది టోర్నీ కోసం పెషావర్ జల్మీ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో అతడి రీప్లేస్మెంట్గా కార్బిన్ను MI తీసుకుంది. ఈ నేపథ్యంలో PSL నుంచి కార్బిన్ వైదొలిగారు. దీంతో వచ్చే ఏడాదికి కార్బిన్ను నిషేధిస్తున్నట్లు PSL యాజమాన్యం ప్రకటించింది.
News April 12, 2025
రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
News April 12, 2025
సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.