News May 28, 2024
పామర్రులో తొలి ఫలితం వచ్చే అవకాశం

కృష్ణా జిల్లాకు సంబంధించి జూన్ 4న మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని నియోజకవర్గాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు పక్రియ కొనసాగిస్తారు. కాగా, జిల్లాలో తొలి ఫలితం పామర్రుది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17 కాగా, అభ్యర్థులు 8 మందే పోటీలో ఉన్నారు. దీంతో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత మచిలీపట్నం ఫలితం రావొచ్చని చెబుతున్నారు.
Similar News
News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
News April 24, 2025
మచిలీపట్నం: నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

కృష్ణాజిల్లాలో మండల సమీక్షా సమావేశం గురువారం మచిలీపట్నంలో జరగనుంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సురేష్ అధ్యక్షతన ఉదయం 10.30ని.లకు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ప్రజా ప్రతినిథులు పాల్గొననున్నారు. అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు.
News April 24, 2025
మచిలీపట్నం: ‘హోంగార్డ్ సంక్షేమానికి కృషి చేస్తాం’

పోలీస్ శాఖలో అంతర్భాగంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కృష్ణాజిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధరరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హోంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించారు. హోంగార్డుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.