News April 13, 2025
పామిడి అమ్మాయికి 984 మార్కులు

ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.
Similar News
News April 23, 2025
10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.
News April 23, 2025
10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు.!

అనంతపురం జిల్లా శింగనమల KGBVలో ఖాళీ పోస్టులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. KGBVలోని టైప్-3 హస్టల్‌లో ఉన్న ఖాళీలను MEO నరసింహ రాజు వివరించారు. KGBV-3లో హెడ్ కుక్-1 పోస్ట్, అసిస్టెంట్ కుక్-3 పోస్టులు, వాచ్‌మెన్-1 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టైప్-4లో చౌకీదార్-1, హెడ్ కుక్-1, అసిస్టెంట్ కుక్-1 ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30లోగా మహిళలు ఈ పోస్టులకు శింగనమల MEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.