News April 16, 2025

పామిడి విద్యార్థినికి లోకేశ్ సన్మానం

image

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.

Similar News

News November 20, 2025

MHBD: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే: డీఎంహెచ్‌వో

image

మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో డీఎంహెచ్‌వో (DMHO) రవి రాథోడ్ పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల వారు ప్రతి నెల 5వ తేదీలోపు ఫామ్-ఎఫ్లను ఆరోగ్యశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.

News November 20, 2025

నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో Dy.CM భట్టి, మంత్రి తుమ్మల

image

హైదరాబాద్ హైటెక్స్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ ఛైర్మన్ షాజీ, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితర ప్రముఖులు హాజరై పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

News November 20, 2025

సిద్దిపేట: ‘నా చిట్టి చేతులు’ ఇటుక బట్టీల పాలు!

image

బడికి వెళ్లి హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో పిల్లల భవిష్యత్ బూడిద పాలవుతుంది. ఈ దయనీయ పరిస్థితి అక్బర్ పేట భూంపల్లిలోని ఇటుక బట్టీలో కనిపించింది. ప్రభుత్వాలు 18 ఏళ్లు నిండని పిల్లలతో పనులు చేయించవద్దని చెప్తున్న కాంట్రాక్టర్‌లు, గుత్తేదారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారు తమకు నచ్చినట్లుగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుక బట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.