News July 21, 2024
పాములపాడు మండలంలో దారుణ హత్య..వివరాలు

పాములపాడు మండలంలో <<13666742>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ఇస్వాలకి చెందిన ఎర్రన్న గొర్రెల వ్యాపారం చేసేవాడు. శుక్రవారం రాత్రి ఫోన్ వస్తే బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోయేసరికి బంధువులతో కలిసి వెతకగా చెలిమిల్ల సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు ఎర్రన్న బైక్ బ్యాగులో ఓ సంచిలో నిమ్మకాయలు, టెంకాయలు గుర్తించారు. దర్యాప్తును దారి మళ్లించేందుకు ఇలా చేసుంటారని అనుమానిస్తున్నారు.
Similar News
News December 25, 2025
కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
News December 25, 2025
గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు: కలెక్టర్

రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూ హక్కు పత్రాలు తీసుకుని రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు. గతంలో పంపిణీ చేసిన పాస్ పుస్తకలను వెనక్కి తీసుకొని రాజముద్ర కలిగిన పుస్తకలను అందజేస్తామన్నారు.
News December 25, 2025
వరస వివాదాల్లో శ్రీశైలం మల్లన్న క్షేత్రం!

శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరస వివాదాలతో SMలో వైరల్ అవుతోంది. భద్రతా లోపాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యవహారం, ఓ యువతి డాన్స్, నిన్న క్షేత్ర పరిధిలో పేకాట తదితర ఘటనలతో మల్లన్న క్షేత్రం పేరు తెరపైకొస్తుంది. మరోవైపు అర్హతలను మరచి ప్రమోషన్లు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఆ మల్లన్నే శ్రీశైలం క్షేత్రాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.


