News March 27, 2025
పామ్ ఆయిల్ రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి MP వినతి

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పామాయిల్ తోటల సాగుకు అనువైనవని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ జిల్లాల్లో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. నాసిరకమైన విత్తనాలు, నర్సరీల్లో అవినీతి, అధికారుల నుంచి సరైన అవగాహన సదస్సులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
Similar News
News October 29, 2025
సూర్యాపేట: భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు

మోంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 62814 92368 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
News October 29, 2025
NGKL: భారీ వర్షాలు… జూనియర్ కళాశాలలకు నేడు సెలవు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా కేంద్రంలో రెడ్ అలర్ట్ ఉన్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఐఈవో వెంకటరమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ సెలవుకు బదులుగా రాబోయే రెండవ శనివారం రోజున కళాశాలలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: ఫ్యామిలీ గ్రూపులో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్(24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహమైంది. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో తన చావుకు కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


