News March 17, 2025

పాయకరావుపేట: పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

image

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎటువంటి భయాందోళనలు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ట్విట్టర్ ద్వారా విద్యార్థులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News November 28, 2025

MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

image

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్‌పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News November 28, 2025

గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

MBNR: ‘టీ-పోల్‌’ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీ-పోల్’ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈ యాప్‌ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు.