News February 17, 2025
పాయకరావుపేట: బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సమీక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై అధికారులతో హోం మంత్రి చర్చించారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందుగా మహా శివుడిని దర్శించుకున్నారు.
Similar News
News October 19, 2025
పల్నాడు: HYD-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మార్గం ఇదే.!

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల భాగంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే.. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఈ హైవే ద్వారా కేవలం 3 గంటల్లో అమరావతి చేరుకునేలా డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. పల్నాడు జిల్లాలో ఈ హైవే పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, మాచవరం, తురకపాలెం, మొర్జంపాడు గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు.
News October 19, 2025
ముడతలు తొలగించే గాడ్జెట్

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.
News October 19, 2025
IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.