News June 16, 2024
పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తాం: సింగరేణి C&MD

అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యవర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తోందన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.
Similar News
News November 27, 2025
కరీంనగర్‌లో తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్‌లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.
News November 27, 2025
KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 27, 2025
KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.


