News March 3, 2025
పారదర్శకంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

పారదర్శకతతో ఓట్ల లెక్కింపు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక సర్. సి. ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్లను 456 కేంద్రాల్లో లెక్కించనున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
సిరిసిల్ల: నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీ యువతి యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 26, 2025
అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు


