News November 30, 2024

పారదర్శకంగా ఫిర్యాదుల విచారణ: కలెక్టర్

image

రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యాదులను పారదర్శకంగా విచారణ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి, జేసీ విష్ణుచరణ్‌తో కలిసి ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 22, 2026

నంద్యాల: Night view అదరహో!

image

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఓం నమఃశివాయ!

News January 22, 2026

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

image

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.