News July 13, 2024
పారదర్శకంగా ‘మహిళా శక్తి’ లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంతో వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే, సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 25, 2025
NZB జిల్లాలో ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు అంటే?

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 100% ST GP ల్లో ST (W) -33, ST(Gen) 38, నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ST(W) 8, ST(Gen) 17, SC(W) 35, SC (Gen) 47, BC(W) 55, BC (Gen) 70, అన్ రిజర్వ్డ్ పంచాయతీల్లో మహిళలకు 113, పురుషులకు 129 వార్డులను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు.