News August 5, 2024
పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా క్రీడాకారుడు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి పారిస్‌లో ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో రవి భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. అతణ్ని క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం విక్రయించారు. ఆదాయపు పన్ను విభాగంలో అధికారిగా పనిచేస్తున్న రవి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని అన్నారు.
Similar News
News September 15, 2024
విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం
సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
News September 15, 2024
విశాఖ: మానసిక వైద్యుడిపై కేసు
బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన మానసిక వైద్యుడు సతీశ్ కుమార్‌పై పీఎం పాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతోంది. దీంతో మిధిలాపురి వుడా కాలనీలోని సతీశ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 15, 2024
విశాఖ: సెలవు ఇవ్వాలని రైతుల వినతి
సాధారణంగా రైతులు, రైతు బజార్లకు సైతం వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. విశాఖలోని సీతమ్మధార, కంచరపాలెం, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్లకు ఇదే తరహాలో సెలవు ఉండేది. దీనిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు సెలవు కావాలంటూ రైతులు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. సెలవు కొనసాగేలా మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.