News July 10, 2024
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో టెక్కలి యువకుడు ప్రతిభ

ఉగండాలో ఈనెల 1వ తేదీన జరిగిన పారా బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన చాపర పూర్ణారావు అనే యువకుడు ప్రతిభ కనబరిచాడు. మిక్స్డ్ డబుల్స్లో బంగారం, మెన్ డబుల్స్లో వెండి, సింగిల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లు, నడుము విడిపోయినప్పటికీ ఆటలో తన ప్రతిభ కనబరిచిన పూర్ణను పలువురు అభినందించారు.
Similar News
News November 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు
News November 7, 2025
SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.
News November 7, 2025
దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.


