News February 15, 2025
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్

ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామనగర్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను పంపిణీ చేశారు.
Similar News
News January 8, 2026
పల్నాడు జిల్లా వైసీపీ ఐటీ కార్యదర్శిగా సుకమంచి

పల్నాడు జిల్లా వైసీపీ ఐటీ విభాగం కార్యదర్శిగా రొంపిచర్ల మండలం రెడ్డిపాలెంకు చెందిన సుకమంచి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ MLA గోపిరెడ్డి సహకారంతో ఈ పదవి లభించిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఐటీ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
News January 8, 2026
బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News January 8, 2026
GNT: ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ప్రేమ.. నిండు ప్రాణం బలి.!

తెనాలికి చెందిన 9వ తరగతి బాలిక అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమించుకోవడం, అతడి ఖర్చులకు తరచూ డబ్బులిస్తుండడం తెలిసిందే. గత నెల 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకలకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అతడు టీసీ తీసుకువెళ్తానని చెప్పగా ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుంటూరులో మృతి చెందింది. దీంతో పోలీసులు బాలుడిపై పోక్సో కేసును 306 కిందకు మార్చారు.


