News February 15, 2025

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్

image

ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామనగర్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను పంపిణీ చేశారు.

Similar News

News March 24, 2025

విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

image

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్‌ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్‌లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్‌ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్‌శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.

News March 24, 2025

జాగ్రత్తగా మాట్లాడితే మంచిది: రజినీకి MP లావు కౌంటర్

image

AP: MP లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశాలతోనే తనపై ACB కేసు పెట్టిందని విడదల రజినీ ఆరోపించడంపై MP స్పందించారు. ‘ఫోన్ డేటా, భూముల విషయాలపై జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఒకరిని విమర్శించే ముందు వివరాలన్నీ తెలుసుకోవాలి. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌కు, నాకూ ఏ సంబంధం లేదని IPS అధికారి పి.జాషువా స్టేట్‌మెంట్‌లో చెప్పారు. స్టోన్ క్రషర్స్‌లో అక్రమాలు జరిగాయని మీరే ఫిర్యాదు చేశారు’ అని అన్నారు.

News March 24, 2025

హైటెక్‌సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

image

టీ, స్నాక్స్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్‌సిటీలో నూతన బ్రాంచ్‌ను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్‌లెట్‌ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్‌తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.

error: Content is protected !!