News March 27, 2025

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సు బుధవారం విజయవాడ సచివాలయంలో రెండవ రోజు జరగగా.. జిల్లా ప్రగతిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో 5000 హెక్టార్లలో రైతులు పంటలు పండించడానికి ఆమోదం తెలిపి ఉన్నారని పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

ఖమ్మంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

image

శాంతి సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

News October 21, 2025

పేదల సంక్షేమం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి(M) ధర్మతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలే నడిపిస్తున్నామని చెప్పారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్‌ పాల్గొన్నారు.

News October 21, 2025

ఆసుపత్రికి చెవిరెడ్డి తరలింపు

image

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో రిమాండ్ పడటంతో విజయవాడ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పంటి సమస్య ఇబ్బంది పెట్టడంతో విజయవాడలోని గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్‌కు చెవిరెడ్డిని తరలించారు. చికిత్స అనంతరం జైలుకు తీసుకెళ్లనున్నారు.