News February 11, 2025
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్

పల్నాడు జిల్లా నుంచి పరిశ్రమల ఎగుమతిని ప్రోత్సహించాలని కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం పై, సూక్ష్మ చిన్న సంస్థల అభివృద్ధి ప్రోగ్రాం పై సమావేశం నిర్వహించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంలో 4,028 మందికి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. 335 యూనిట్లకు బ్యాంకు రుణాలు అందినట్లు వివరించారు.
Similar News
News September 13, 2025
NLG: మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు!

ఉమ్మడి NLG జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు నల్గొండ DCCB గుడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ వేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలు అందించనుంది. కాగా జిల్లాలో 1,255 మహిళా సంఘాలున్నాయి.
News September 13, 2025
మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.
News September 13, 2025
భద్రాచలం: గోదావరి పుష్కరాలు.. CM కీలక నిర్ణయం..!

2026లో జరగబోయే గోదావరి పుష్కరాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల వద్ద టెంపుల్ సెంట్రిక్ ఘాట్‌లను నిర్మించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందుకు వీలుగా శాశ్వత ఘాట్‌లను నిర్మించాలన్నారు.