News July 27, 2024

పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: అనంత కలెక్టర్

image

పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 49వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) సమావేశం నిర్వహించారు.

Similar News

News December 12, 2024

వీరుడికి కన్నీటితో సెల్యూట్

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

News December 12, 2024

వీర జవాన్ కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి పరామర్శ

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) భౌతికకాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళి అర్పించారు. భౌతికకాయాన్ని అధికారులు నిన్న రాత్రి నార్పలకు తీసుకురాగా ఆమె సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

News December 12, 2024

అక్రమ మద్యం వ్యాపారికి మూడేళ్లు జైలు శిక్ష

image

గోరంట్ల మండలం ముద్దులకుంట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 2021లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీఐ జయనాయక్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు సుదీర్ఘ విచారణ చేసి నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు.