News February 27, 2026
పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: ఏలూరు కలెక్టర్

జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి PM FME పథకంలో 168 లక్ష్యానికి 176 దరఖాస్తులు వచ్చాయని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. గురువారం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ నిర్వహించారు. రూ.679 కోట్లతో వివిధ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ఆమె వెల్లడించారు. దీనివల్ల 1,561 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
Similar News
News April 13, 2026
VZM: గొర్రెల కాపరిని తాళ్లతో కట్టిపడేసిన దుండగులు

బొండపల్లి మండలం గొల్లలపేటకు చెందిన పీతల సత్యం(60) ఆదివారం గ్రామానికి సమీపంలోని చింతల చెరువు వద్ద గొర్రెలు కాస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తాటినారతో కాళ్లు,చేతులు,మెడను కట్టి పొదల్లో పడేసినట్లు బాధితుడు వాపోయాడు. అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు సాయంత్రం తుప్పల్లో పడి ఉన్న సత్యంను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గజపతినగరం ఆసుపత్రికి తరలించారు.
News April 13, 2026
ఏలూరు: ఆ విషాద ఘటనకు నాలుగేళ్లు..!

ఏలూరు(D) అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్‌లో 2022 ఏప్రిల్ 13న సంభవించిన రియాక్టర్ పేలుడు తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై APPCB, CPCB విచారణ చేపట్టాయి. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
News April 13, 2026
ద్రాక్షారామలో ఈ “చిన్న” గుడి రహస్యం తెలుసా?

ద్రాక్షారామ ఆలయ ప్రాంగణంలోనే ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉందని స్థానికులు చెబుతారు. కలియుగం గడిచేకొద్దీ మానవుల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, అప్పుడు వారు ఈ భారీ ఆలయంలో పూజలు చేయలేరని భావించి, భవిష్యత్తులోని “పొట్టి” మానవుల కోసం ఈ సూక్ష్మ ఆలయాన్ని నిర్మించారట. దీనిని ప్రధాన ఆలయ నమూనాగా కూడా కొందరు పరిశోధకులు భావిస్తారు.


