News December 24, 2024
పారిశ్రామిక హబ్గా రాయలసీమ!
ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్క్లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయి. జపాన్ సంస్థ ₹14వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని చెబుతున్నారు. దీనికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు రానున్నాయి. వేలాది మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News December 26, 2024
కర్నూలు: రైలు నుంచి పడిపోయిన యువతి
కర్నూలు జిల్లా యువతి రైలు నుంచి జారిపడిపోయింది. దేవనకొండ(M) కరివేములకు చెందిన హరిత తమ్ముడితో కలిసి గుత్తికి రైల్లో బయల్దేరింది. మార్గమధ్యలో బాత్రూముకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ్ముడు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించాడు. హరిత ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
News December 26, 2024
నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.
News December 25, 2024
శిల్పా రవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తన స్నేహితుడు అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే కనీసం కనిపించకపోవడం ఏంటని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అరెస్ట్ అయిన సమయంలోనూ స్పందించలేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వీటికి శిల్ప అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. అందులో వాస్తవం లేదని కామెంట్ చేస్తున్నారు.