News July 23, 2024
పారిస్ ఒలింపిక్స్‌కు విశాఖ కోచ్

విశాఖకు చెందిన బాక్సింగ్ కోచ్ ఐ.వెంకటేశ్వరరావు పారిస్ ఒలింపిక్స్‌లో టెక్నికల్ ఆఫిషియల్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ అఫీషియల్స్ న్యూఢిల్లీ నుంచి బుధవారం బయలుదేరనున్నామన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆరుగురు కాంటింజెంట్ సభ్యులు ఇప్పటికే జర్మనీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. కాగా.. వెంకటేశ్వరరావు ద్రోణాచార్య అవార్డు గ్రహీత.
Similar News
News February 27, 2026
మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 27, 2026
అరుదైన క్యాన్సర్‌కు చికిత్స చేసిన కేజీహెచ్ వైద్యులు

ఐదు గంటల పాటు రోగికి సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు కేజీహెచ్ వైద్యులు. మాడుగుల ప్రాంతానికి చెందిన43 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఆబ్జెక్టివ్ జాండీస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. వైద్యులు వెండి తేజేశ్వరరావు పరీక్షలు నిర్వహించి ఐదు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. అరుదైన క్యాన్సర్‌గా అధిక మరణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి పూర్తిగా తగ్గేలా సర్జరీ చేసి చికిత్స అందించిన వైద్యులకు రోగి కృతజ్ఞతలు తెలిపారు.
News February 27, 2026
45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.


