News July 28, 2024
పారిస్ ఒలింపిక్స్.. కాసేపట్లో బరిలోకి నిఖత్
పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా నేడు మహిళల 50 కేజీల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈరోజు సాయంత్రం 3.50గంటలకు బరిలో దిగనున్నారు. మ్యాక్సీ కరీనా (జర్మనీ)తో నిఖత్ తలపడనున్నారు. రింగ్‌లో దూకుడైన ఆట తీరుతో నిఖత్ తన ఒలింపిక్స్ బౌట్‌లో ఎలాంటి ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి.. ALL THE BEST
Similar News
News October 13, 2024
బాసర అమ్మవారికి దిల్‌రాజు పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.
News October 13, 2024
కామారెడ్డి: తండ్రి మృతదేహం లభ్యం
తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
NZB: డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 8 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 6 గురు SGT, ఇద్దరు SA కొలువులు సాధించారు.ఉద్యోగాలు సాధించిన వారిలో గణపురం సుశీల(SGT), సదాలి నరేష్(SGT), గైని రాజు(SGT), అన్నాడి అజయ్ కుమార్(SGT), M.శ్రీశైలం(SGT), మొహ్మద్ ఖాజా(SGT), నంద అనిల్ (SA సోషల్), దేవసోత్ చందర్ రాథోడ్(SAసోషల్) ఉన్నారు.