News April 16, 2025
పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు

రజతోత్సవ సభకు వేలాది వాహనాలు తరలివస్తాయని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తి రజతోత్సవ సభ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే కార్యకర్తలకు, సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని సూచించారు.
Similar News
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపారు.
News November 15, 2025
జనగామ: 17 నుంచి పత్తి కొనుగోళ్ల నిలిపివేత

తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 17 నుంచి జనగామ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోళ్లు, ప్రైవేటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ తెలిపారు. కావున.. రైతులు మార్కెట్‌కు, జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
News November 15, 2025
NTR: వైసీపీలోకి రంగా వారసురాలు..?

దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. రేపు ఉదయం బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రంగా కుమార్తె ఆశ కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, YCPలో చేరే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.


