News April 16, 2025

పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు

image

రజతోత్సవ సభకు వేలాది వాహనాలు తరలివస్తాయని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తి రజతోత్సవ సభ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే కార్యకర్తలకు, సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని సూచించారు.

Similar News

News April 21, 2025

MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

image

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

News April 21, 2025

ధర్మవరానికి రండి.. UP సీఎంకు మంత్రి ఆహ్వానం

image

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం పట్టు వస్త్రం, నిమ్మలకుంట కళాకారులు తయారు చేసిన శ్రీకృష్ణుడి తోలుబొమ్మను సీఎంకు అందజేశారు. వీటి విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ధర్మవరానికి రావాలని కోరగా తన ఆహ్వానాన్ని సీఎం స్వీకరించారని మంత్రి తెలిపారు.

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. మేడ్చల్‌లో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన మేడ్చల్ జిల్లాలో 150 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 71,286 విద్యార్థులకు 69,842 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 63,946 విద్యార్థులకు 62,969 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT

error: Content is protected !!