News February 5, 2025
పార్కులలోని పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్
పార్కుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, మరమ్మతులు, దెబ్బతిన లైటింగ్ పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 6, 2025
ఈ సేవ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన సీఎస్సీ, ఈ సేవ కేంద్రాన్ని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోజువారి వసూళ్ల తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్టార్‌ను పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేస్తూ రోజువారి ట్రెజరీ సమర్పించి కలెక్షన్స్ నిర్వహణతో పాటు రికార్డులు భద్ర పరచాలని తెలిపారు. పన్నులు చెల్లించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు.
News February 5, 2025
WGL: సమగ్ర సమాచారంతో బడ్జెట్ రూపకల్పన
సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. బడ్జెట్ 2025-26 రూపకల్పనపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్లో రూపొందించడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందరి సహకారంతో బడ్జెట్ రూపొందించాలని, మున్సిపల్ చట్టం-2019 ప్రకారం బడ్జెట్ మొత్తం నుంచి 10% గ్రీన్ బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.
News February 5, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. గీసుకొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహానికి తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా లేదని, గుడ్లు ఉడకని అందిస్తున్నారని తెలిపారు.