News September 10, 2024

పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

image

పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని కామెంట్స్ చేశారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.