News January 26, 2025

పార్టీ మారే ఆలోచన లేదు: పిల్లి సుభాష్ చంద్రబోస్

image

రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, వైసీపీకి వెన్నెముకగా పని చేశారని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తిరిగి ఎన్నికయ్యే పరిస్థితి లేదన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకులు వస్తుంటారు.. పోతుంటారని ఆ జాబితాలో విజయసాయిరెడ్డి ఉంటారని తాము ఊహించలేదని అన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

Similar News

News February 18, 2025

నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

image

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

News February 18, 2025

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.

News February 18, 2025

సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

image

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.

error: Content is protected !!