News June 17, 2024
పార్టీ మార్పు వార్తలపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు..!
తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు.
Similar News
News October 8, 2024
సంగారెడ్డి: అమ్మానాన్న, తమ్ముడు మృతితో..
న్యాల్కల్ మండలంలో నిన్న జరిగిన <<14298722>>యాక్సిడెంట్<<>>లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. గణేశ్‌పూర్‌కు చెందిన సిద్రామ్(70).. కూతురు రేణుక, అల్లుడు జగన్నాథ్(40), మనవడు వినయ్(14)తో కలిసి బైక్‌పై పొలానికి వెళ్లి వస్తున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోగా ప్రమాదం జరిగింది. జగన్నాథ్ ఇల్లరికం అల్లుడు. ప్రమాదంలో అమ్మానాన్న, తమ్ముడు, తాతను కొల్పోయిన రేణుక ఇద్దరు కూతుళ్ల కన్నీరుమున్నీరయ్యారు.
News October 8, 2024
రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలి: హరీశ్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, BRS నేత హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజలు ఆవేదనకు గురిచేస్తోందని మండిపడ్డారు. అవకాశాలు వస్తే పేదలకు మంచి చేయాలని అంతే గానీ వారికి కన్నీరు పెట్టించడం సరికాదన్నారు. మల్కాజిగిరి పరిధిలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ చెప్పారు.
News October 7, 2024
మెదక్: ‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.