News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News October 4, 2024

కందుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

కందుకూరు శివారులోని పామూరు రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం ముప్పాళ్ళ నుంచి నెల్లూరు జిల్లా ASపేట దర్గాకు ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను, ఎదురుగా పొగాకు చెక్కులతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ళ బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కందుకూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

News October 4, 2024

ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

News October 4, 2024

ప్రకాశం: అక్రమ రవాణాపై దృష్టి సారించండి: కలెక్టర్

image

జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మైనింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు.