News May 27, 2024
పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు కీలకం: కలెక్టర్
ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్లో లెక్కింపు సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, లెక్కింపు సిబ్బందికి విధులపై అవగాహన కల్పించారు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News November 17, 2024
ఖమ్మం: విద్యార్థికి గుండు కొట్టించిన Asst ప్రొఫెసర్
ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థికి Asst ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 12న ములుగు జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైనీస్ స్టైల్లో కటింగ్ చేయించుకున్నాడు. దీంతో అతడి హెయిర్ స్టైల్ చూసి సీనియర్ విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్న ఓ Asst ప్రొఫెసర్ అతడిని కటింగ్ షాప్కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు.
News November 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> చింతకాని మండలం నాగులవంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి పర్యటన > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు > బోనకల్లో సీపీఎం పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం > బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన > వైరాలో ఉచిత వైద్య శిబిరం> > హెల్త్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రాక> టేకులపల్లి > టేకులపల్లిలో మండల మహాసభ> భద్రాచలం రామాలయంలో పూజలు
News November 17, 2024
చండ్రుగొండ: గుడికి వెళ్లోస్తూ రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు మృతి
చండ్రుగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14629552>>తండ్రీకొడుకు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంకి చెందిన సతీశ్ కుమార్(43) అయ్యప్ప మాల ధరించాడు. కాగా నిన్న వారు భద్రాచలంలో సీతారాముల దర్శనానికి బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొంది. ఈప్రమాదంలో తండ్రీకొడుకుల తలలు పగిలిపోవడంతో స్పాట్లోనే మృతిచెందారు.