News July 22, 2024
పార్వతి బ్యారేజీ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి (సుందిల్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చిన వరదతో కరకట్ట మరమ్మతుకు గురైంది. అప్పటి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News November 28, 2024
కరీంనగర్: చలికాలం జాగ్రత్త!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 28, 2024
KNR: వణికిస్తున్న చలి.. గ్రామాల్లో చలి కాగుతున్న యువత
చలి తీవ్రత అధికమవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న చలికి గ్రామాల్లో ఉమ్మడి KNR ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకే చోట గుమికూడి చిన్ననాటి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ చలికాగే రోజులు ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో ఆరు బయట గడ్డి, టైర్లు, కట్టెల మంట వేసుకొని చలి కాగు సేదతీరే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్వకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తోంది.
News November 28, 2024
స్పెల్లింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి ఉత్తం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెల్లింపులు తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.