News May 24, 2024
పార్వతీపురంలో అక్రమంగా పట్టుబడిన మద్యం ధ్వంసం

పార్వతీపురంలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా, మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సునీల్ షరైన్, సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 576 మద్యం బాటిల్స్తో పాటు, సుమారు 130 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
VZM: ఒక్కరోజే రూ.7.76 కోట్ల మద్యం ఫుల్గా తాగేశారు

విజయనగరం జిల్లాలో ఆబ్కారీ ఆదాయానికి 2026 సంవత్సరం ప్రారంభ రోజే కొత్త కిక్కునిచ్చింది. డిసెంబర్ 31న మందు బాబులు ఫుల్ జోష్ చేసుకున్నారు. ఏకంగా జిల్లాలో రూ.7.76 కోట్లు విలువ చేసే మద్యాన్ని తాగేశారు. గత ఏడాది రూ.5.27 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.2.50 కోట్ల ఆదాయం పెరిగింది. డిసెంబర్ 31న వైన్, బార్ అండ్ రెస్టారెంట్స్లో అమ్మకాలకు 2 గంటల వరకు అదనంగా అనుమతులు ఇచ్చారు.
News January 2, 2026
విశాఖ రేంజ్ ఐజీతో విజయనగరం ఎస్పీ భేటీ

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని ఐజీ గోపినాథ్ జట్టి పేర్కొన్నారు.
News January 2, 2026
జనవరి 17న “స్వచ్ఛ రథం” పథకం ప్రారంభం: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణ లక్ష్యంగా “స్వచ్ఛ రథం” పథకాన్ని జనవరి 17న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పొడి చెత్తను సేకరించి, వస్తు మార్పిడి విధానంలో నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపారు. దీంతో చెత్త వేర్పాటు అలవాటు పెరిగి గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు.


