News May 24, 2024
పార్వతీపురంలో అక్రమంగా పట్టుబడిన మద్యం ధ్వంసం

పార్వతీపురంలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా, మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సునీల్ షరైన్, సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 576 మద్యం బాటిల్స్‌తో పాటు, సుమారు 130 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2025
నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.
News February 16, 2025
వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.
News February 15, 2025
వారిని కచ్చితంగా శిక్షించాలి: SP వకుల్ జిందాల్

NDPS((నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితులు కచ్చితంగా శిక్షించాలిలని SP వకుల్ జిందాల్ అన్నారు. విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. NDPS చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపరిచిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు.