News March 2, 2025

పార్వతీపురంలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు

image

పార్వతీపురం నడిబొడ్డున గల వరహాలు గడ్డలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అంటూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారా ప్యాకింగ్‌కు ప్లాస్టిక్ కవర్లు ఎలా దొరుకుతున్నాయని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, ఎక్సైజ్ అధికారులు సారా నియంత్రణలో భాగంగా నవోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ, సారా విక్రయాలు వారికి సవాల్‌గా మారాయి.

Similar News

News November 26, 2025

రాజ్యాంగ విలువలు కాపాడాలి: నల్గొండ అదనపు ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అదనపు ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుని, హక్కులు, న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, దాని స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.

News November 26, 2025

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే చెప్పండి: మంత్రి నాదెండ్ల

image

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటూ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో రైతుల దగ్గరకి వెళ్లి ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుందన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు.

News November 26, 2025

NGKL: రేపటి నుంచి సర్పంచ్‌ నామినేషన్ల స్వీకరణ

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, వంగూరు, తెలకపల్లి, తాడూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.