News March 30, 2025
పార్వతీపురంలో నేడు ఈ మండలాలకు అలర్ట్

పార్వతీపురం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణగ్రతలు నమోదవుతాయని (APSDMA) అధికారిక ‘x’ ఖాతా ద్వారా ఆదివారం తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పార్వతీపురం 40.6, సీతానగరం 41.0,బలిజిపేట 41.0, కురుపాం 30.9,గరుగుబిల్లి 41.1, గుమ్మలక్ష్మీపురం 40.0, కొమరాడ 40.2,జియమ్మవలస 40.5, సాలూరు 38.7, మక్కువ 39.9, పాచిపెంట 38.4, పాలకొండ 40.2, వీరఘట్టం 40.7, సీతంపేట 39.8, భామిని 40.0 నమోదవుతాయి.
Similar News
News September 19, 2025
NMMS స్కాలర్షిప్ గడువు పొడిగింపు: డీఈవో

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.
News September 19, 2025
ఐటీఐ కోర్సులో మిగులు సీట్లు భర్తీ దరఖాస్తుల ఆహ్వానం

మన్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగులు సీట్లు కొరకు 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాస ఆచారి గురువారం తెలిపారు. ఈ నెల 27 తేదీ వరకు వెబ్ పోర్టల్ http://iti.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తరువాత ప్రింట్ తీసుకొని ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు.
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్‌కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.