News April 10, 2024

పార్వతీపురంలో పశువుల వ్యాన్ సీజ్

image

పార్వతీపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువుల వ్యాన్ సీజ్ చేసినట్లు పార్వతీపురం తహశీల్దార్ కె.ఆనందరావు తెలిపారు. స్థానిక ఎస్సై సంతోషి కుమారితో పార్వతీపురంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ ఇనస్పెక్టర్ వి.రామకృష్ణ ఉన్నారు.

Similar News

News March 25, 2025

బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి 

image

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

News March 25, 2025

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ 30 మంది అనాథ‌ చిన్నారులకు చూసే అవ‌కాశం క‌ల్పించింది. సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.

News March 25, 2025

VZM: నేడు,రేపు APPSC ప‌రీక్ష‌లు

image

నేడు, రేపు జ‌ర‌గ‌నున్న APPSC ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసిన DRO ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీర్‌, 25, 26 తేదీల్లో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులోని అన‌లిస్ట్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు, 26న డిప్యూటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!