News January 26, 2025
పార్వతీపురంలో ప్రత్యేక ఆకర్షణగా శకటాలు

పార్వతీపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపికైన పాఠశాల విద్య, ఇంజినీరింగ్ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శకటాలకు బహుమతులు వరించాయి. శకటాలు ఏర్పాటు చేసిన వారందరినీ కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 23, 2025
వరంగల్: ఇవేం రేషన్ కార్డులు..?

ఆయన ముఖ్యమంత్రి కాదు. అలాగని మంత్రి కాదు. కనీసం MLA కూడా కాదు. అయినా అతని ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ నేత ఒకరు తన ఫొటో, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతుండటం చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున పంచుతున్నట్లు ఆ కార్డులో ఉంది. ఇలాంటి రేషన్ కార్డులపై మీరేం అంటారు.
News November 23, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి సమీక్ష

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్, సివిల్ సప్లై అధికారులతో కలిసి కొనుగోలు పురోగతిని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా, పారదర్శకంగా కొనుగోలు జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు, వాహనాలు, హమాలీలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని సూచించారు.
News November 23, 2025
బీసీసీఐ ట్రోఫీకి సిద్దిపేట యువకుడు

బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీ హెచ్సీఏ టీమ్లోకి సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు అర్ఫాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. నవంబర్ 26 నుంచి కోల్కతాలో జరిగే ఈ టోర్నమెంట్లో అహ్మద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కలకుంట్ల మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేస్తూ అర్ఫాజ్కు శుభాకాంక్షలు తెలిపారు.


