News January 26, 2025
పార్వతీపురంలో ప్రత్యేక ఆకర్షణగా శకటాలు

పార్వతీపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపికైన పాఠశాల విద్య, ఇంజినీరింగ్ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శకటాలకు బహుమతులు వరించాయి. శకటాలు ఏర్పాటు చేసిన వారందరినీ కలెక్టర్ అభినందించారు.
Similar News
News February 15, 2025
జగిత్యాల: జిల్లాలోని 50 PACS పాలకవర్గాల గడువు పొడిగింపు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం పాలక వర్గాల గడువును 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. JGTL జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రస్తుత పాలకవర్గాలకు మరో 6 నెలల పాటు అవకాశం లభించింది. ప్రస్తుత PACSల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఆయా సంఘాల ఛైర్మన్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతారు.
News February 15, 2025
పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 15, 2025
భీమవరం : గాయపడిన బాలుడి మృతి

భీమవరంలో ఈనెల 12న కోటేశ్వరరావు అనే బాలుడుకి(10) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కొక్కి తగులుకుని కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో గమనించిన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 13న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాలుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.