News March 24, 2025
పార్వతీపురంలో యువతకు పీఎం ఇంటర్న్షిప్: కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కోరారు. కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 500 లకు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్షిప్ పొందవచ్చని సూచించారు.
Similar News
News December 8, 2025
3 రోజుల్లో రూ.103 కోట్ల కలెక్షన్లు

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు 3 రోజుల్లో రూ.103 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. సినిమా విడుదలైన తొలిరోజు శుక్రవారం (రూ.28 కోట్లు) కంటే ఆదివారం (రూ.43 కోట్లు) ఎక్కువ వసూళ్లు వచ్చాయి. స్పై కథాంశంతో ఆదిత్య ధార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం తెలుగులో విడుదల కాలేదు.
News December 8, 2025
మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.
News December 8, 2025
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.


