News October 12, 2024
పార్వతీపురంలో రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీ మల్లేశ్వరరావు (37) పట్టణ సమీపంలో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 14, 2024
VZM: స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల నియామకం
జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. బార్లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వారంలో ఐదు రోజులపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.
News November 14, 2024
MLC ఎన్నిక ప్రక్రియ రద్దుపై కలెక్టర్ ప్రకటన
ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉప ఎన్నికకు ఈ నెల 4వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని వెల్లడించారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
News November 14, 2024
ప్యానల్ స్పీకర్ల జాబితాలో ఎస్.కోట MLA
అసెంబ్లీలో కోళ్ల లలిత కుమారీకి కీలక పదవి దక్కింది. పలువురు ఎమ్మెల్యేలను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈ జాబితాలో ఎస్.కోట ఎమ్మెల్యే ఉన్నారు. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. కోళ్ల లలిత కుమారీ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. కాగా కోళ్ల లలిత కుమారి మూడో సారి టీడీపీ నుంచి ఎస్.కోట ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు.