News March 12, 2025

పార్వతీపురంలో వైసీపీ ఆధ్వర్యంలో “యువత పోరు” 

image

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “యువత పోరు” కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యువత పోరు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

image

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

News November 18, 2025

కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.

News November 18, 2025

సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.