News March 12, 2025
పార్వతీపురంలో వైసీపీ ఆధ్వర్యంలో “యువత పోరు”

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “యువత పోరు” కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యువత పోరు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
News March 27, 2025
ఖమ్మం జిల్లాలో బుధవారం నాటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వియ్యం బంజర సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
News March 27, 2025
రామ్ చరణ్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

రామ్ చరణ్‌కు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పెద్ది పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటున్ని కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుందని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ Xలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ NTRతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ తెలిపారు.